ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిపై వైకాపా కుట్రలను బయటపెడుతున్నాం: పట్టాభి - తెదేపా నేత పట్టాభి

ప్రకాశం బ్యారేజీ నుంచి సకాలంలో దిగువకు నీటిని విడుదల చేయకుండా అమరావతిపై వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నిందని... తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి అన్నారు. రాజధాని అమరావతిపై వైకాపా ప్రభుత్వ కుట్రలను ఆధారాలతో సహా బయటపెడుతున్నామని చెప్పారు.

tdp leader pattabi fires on ycp government over amaravathi issue showing evidences
అమరావతిపై వైకాపా కుట్రలను బయటపెడుతున్నాం: పట్టాభి

By

Published : Oct 14, 2020, 7:14 PM IST

అమరావతిపై వైకాపా ప్రభుత్వ కుట్రలను ఆధారాలతో సహా బయటపెడుతున్నామని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తెలిపారు. జలవనరుల శాఖ అధికారిక వెబ్ సైట్ లో ఉన్న ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఆయన వెల్లడించారు. బ్యారేజీ నుంచి సకాలంలో దిగువకు నీటిని విడుదల చేయకుండా కుట్రలో భాగంగా నిల్వ ఉంచారన్నది స్పష్టమవుతోందన్నారు.

ఏదో రకంగా అమరావతి ప్రాంతాన్ని ముంపునకు గురిచేయాలనే కుట్ర ఇక్కడ బయటపడిందని విమర్శించారు. ఎలాంటి హెచ్చరికలు, అప్రమత్తం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా 5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదలటంతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయని తెలిపారు. ప్రభుత్వ కుట్రలు విఫలమవటంతో అమరావతి సురక్షిత ప్రాంతమని రుజువైందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details