ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పంటల బీమాపై ఎన్ని అబద్ధాలు చెప్పారో అన్ని రుజువు చేశాం: పట్టాభి

By

Published : Dec 15, 2020, 12:17 PM IST

వైఎస్సార్ పంటల బీమాలో అన్ని అబద్ధాలే చెప్తున్నారని.. తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ధ్వజమెత్తారు. వైఎస్సార్ పంటల బీమాకు రూ.1252 కోట్లు జమ చేస్తున్నామని ప్రకటన ఇచ్చి.. నేడు కేవలం 918 కోట్లు మాత్రమే జమ చేస్తున్నారని దుయ్యబట్టారు.

tdp leader pattabi fires on ycp about crop insurance
పంటల బీమాపై ఎన్ని అబద్ధాలు చెప్పారో అన్ని రుజువు చేశాం: పట్టాభి

పంటల బీమా విషయంలో సీఎం జగన్‌ శాసనసభలో చెప్పిన దానికి, పేపర్‌ ప్రకటనలకు పొంతన లేదని తెదేపా నేత పట్టాభి దుయ్యబట్టారు. వైఎస్సార్ పంటల బీమాకు రూ.1252 కోట్లు ఇస్తున్నామని పేపర్ ప్రకటన ఇచ్చి.. ఇప్పుడు రూ.918 కోట్లు మాత్రమే జమ చేస్తున్నారని ఆరోపించారు.

తెదేపా హయాంలో 2019లో అంతకు రెట్టింపు స్థాయిలో రూ.18వందల 19 కోట్ల బీమా సొమ్ము రైతులకు వచ్చిందన్నారు. బీమా అర్హత కలిగిన రైతుల సంఖ్యను సైతం 9 లక్షల మేర తగ్గించేశారని ఆరోపించారు. వైఎస్సార్ పంటల భీమాపై ప్రభుత్వం చెప్పే లెక్కలు అన్ని తప్పేనని ఆరోపణలు చేశారు. బీమా పాలసీలు కట్టకుండా రైతుల్ని సీఎం జగన్ నట్టేట ముంచారని మండిపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details