ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మందులు, జీతాల పేరుతో.. రాష్ట్రంలో పెద్ద కుంభకోణం: పట్టాభి - tdp leader pattabi news

కరోనా మెుదటి వేవ్ తరువాత కూడా ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు ఖర్చుచేయలేదని తెదేపా నేత పట్టాభి అన్నారు. మందులు, జీతాల పేరుతో పెద్దకుంభకోణం జరిగిందని ఆరోపించారు.

pattabi fired on cm jagan
మందులు, జీతాల రాష్ట్రంలో పెద్ద కుంభకోణమన్న పట్టాభి

By

Published : May 18, 2021, 12:22 PM IST

మందులు, జీతాల పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. కొవిడ్ మొదటి దశ ప్రారంభమైన దగ్గర నుంచి రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం ఖర్చు చేసింది శూన్యమని దుయ్యబట్టారు.

కోవిడ్ మొదటి దశ నుంచి ఇప్పటి వరకూ రూ. 2,229 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్ని కోట్ల మందికి ఎన్ని మందులు ఇచ్చారో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మందులు, జీతాలకు ఎక్కువ ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపారని.. ప్రతినెలా చెల్లించే వేతనాలను కొవిడ్ ఖర్చుల్లో చూపడమేంటని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details