ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

chikki scam: ఆ స్కామ్​కు బాధ్యత వహించి మంత్రి సురేశ్ రాజీనామా చేయాలి: పట్టాభి - ఏపీ చిక్కీ స్కామ్ వార్తలు

Pattabi On chikki scam: చిన్నపిల్లలకు వారానికి మూడుసార్లు పంచే చిక్కీ(పప్పు చెక్క)లోనూ జగన్ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. చిక్కీ స్కామ్​పై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఆ స్కామ్​కు బాధ్యత వహించి మంత్రి సురేశ్ రాజీనామా చేయాలి
ఆ స్కామ్​కు బాధ్యత వహించి మంత్రి సురేశ్ రాజీనామా చేయాలి

By

Published : Jan 30, 2022, 5:03 PM IST

TDP Leader Pattabi On chikki scam:వివిధ స్కామ్​ల ద్వారా వేలకోట్లు దిగమింగిన జగన్ రెడ్డి.. చిన్నపిల్లలకు వారానికి మూడుసార్లు పంచే చిక్కీ (పప్పు చెక్క)లో కూడా కక్కుర్తి పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు.

చిక్కీ సరఫరాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 2021 - 22 సంవత్సరానికి రూ.198 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. గతేడాది రూ.136 కోట్లు ఉన్న టెండరు వాల్యూను.. ఈ ఏడాది అమాంతం రూ.198 కోట్లకు పెంచేశారని విమర్శించారు. ఈ స్కామ్​కు బాధ్యత వహించి మంత్రి ఆదిమూలపు సురేశ్ రాజీనామా చేయాలన్నారు. చిక్కీ స్కామ్​పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details