ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PATTABHI: 'నా మాటలకు లేని అర్థాలు ఆపాదించారు' - అందుకే కొన్నిరోజులు బయటకు వెళ్లానంటూ ..పట్టాభి వీడియో

రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాటం కొనసాగిస్తానని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ స్పష్టం చేశారు. ఏమాత్రం మానవత్వం లేకుండా నా బిడ్డను షాక్‌కు గురిచేశారు. అమితంగా ప్రేమించే బాధ్యత గల ఒక తండ్రిగా వారి మనోవికాసం కోసం నా బిడ్డని, భార్యని కొన్ని రోజులు బయటికి తీసుకొచ్చాను. దానికి కూడా విపరీతార్థాలు తీశారని పట్టాభి పేర్కొన్నారు.

పట్టాభి
పట్టాభి

By

Published : Oct 26, 2021, 6:38 PM IST

Updated : Oct 27, 2021, 5:05 AM IST

తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాటం కొనసాగిస్తానని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ స్పష్టం చేశారు. తన మాటలకు లేనివి ఆపాదించారని, కుట్రపూరిత ధోరణితోనే ఇలా చేశారని ఆయన ధ్వజమెత్తారు. తనపై పెట్టిన అక్రమ కేసులపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తానని వెల్లడించారు. రాజమండ్రి జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన పట్టాభి మంగళవారం ఒక వీడియోను విడుదల చేశారు. అందులోని వివరాలు ఆయన మాటల్లోనే....

నేను బాధ్యత గల తండ్రిని: ‘గత రెండున్నరేళ్లుగా అనేక అంశాలపై ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీశాను. నేనడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక దాడి చేశారు. వైకాపా నేతలు కుట్రపూరిత ధోరణితోనే ఇవన్నీ చేశారు. నా ఇంటిపై దాడి చేసి ఇంట్లోని 8 ఏళ్ల నా కుమార్తెను భయోత్పాతానికి గురిచేశారు. ఇది చాలా అమానవీయ చర్య. చిన్న వయసులో పసి హృదయానికి గాయమైతే దాన్ని రూపుమాపడం కష్టం. ఏమాత్రం మానవత్వం లేకుండా నా బిడ్డను షాక్‌కు గురిచేశారు. అమితంగా ప్రేమించే బాధ్యత గల ఒక తండ్రిగా వారి మనోవికాసం కోసం నా బిడ్డని, భార్యని కొన్ని రోజులు బయటికి తీసుకొచ్చాను. దానికి కూడా విపరీతార్థాలు తీశారు. నేను బాధ్యత గల తండ్రిగా నా బిడ్డ కోసం నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను...’ అని పట్టాభి పేర్కొన్నారు.

క్రియాశీలకంగా పాల్గొంటా...:‘రాష్ట్రంలో డ్రగ్స్‌ నుంచి ఒక తరాన్ని కాపాడేందుకే ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం. యువత భవిష్యత్తు కోసమే తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌ దీనికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటాను. తప్పుడు కేసులకు భయపడను. న్యాయస్థానాల్లో వాటిని ఎదుర్కొంటాం. మరిన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తాం. ప్రజాస్వామ్యబద్దంగానే మా పోరాటాన్ని కొనసాగిస్తాం. కష్టకాలంలో అండగా నిలిచిన చంద్రబాబు, లోకేశ్‌, అచ్చెన్నాయుడు, ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా...’ అని పట్టాభి పేర్కొన్నారు.

ఇదీ చదవండి..

YSR RYTHU BHAROSA: మేనిఫెస్టోలో హామీలు వంద శాతం నెరవేరుస్తున్నాం: సీఎం జగన్​

Last Updated : Oct 27, 2021, 5:05 AM IST

ABOUT THE AUTHOR

...view details