రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న బ్లాంక్ జీవోలు, రహస్య జీవోల గోప్యతతో గందరగోళం నెలకొందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. అవినీతి పనుల కోసం అర్థరాత్రి 12 గంటలకు జీవోలు విడుదల చేయిస్తున్నారని మండిపడ్డారు. దీనికోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆక్షేపించారు. గవర్నమెంట్ ఆర్డర్ అనేపదానికి ముఖ్యమంత్రి జగన్.. గోల్మాల్ ఆర్డర్ అనే కొత్త అర్థం చెప్పారని ఎద్దేవా చేశారు. ఈ జీవోలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చేస్తున్న అనైతిక పనులకు సహకరిస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
PATTABHI: 'గవర్నమెంట్ ఆర్డర్ అనే పదానికి కొత్త అర్థం చెప్పారు' - pattabhi latest meeting
గవర్నమెంట్ ఆర్డర్(Government Order) అనే పదానికి ముఖ్యమంత్రి జగన్(cm jagan).. గోల్మాల్ ఆర్డర్ అనే కొత్త అర్థాన్ని చెప్పారని తెదేపా నేత పట్టాభిరామ్(TDP leader pattabhi ram) ఆక్షేపించారు. అవినీతి పనుల కోసం అర్థరాత్రి జీవోలు విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా నేత పట్టాభి