రాష్ట్రంలో రహదారులపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి చెప్పినవన్నీ అబద్దాలే అని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో చేసిన ఖర్చు కేవలం రూ.15కోట్లు మాత్రమేనని పట్టాభి విమర్శించారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోపాటు వివిధ బ్యాంకుల ద్వారా తీసుకొచ్చిన రుణాలను ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.
'రెండున్నరేళ్ల వైకాపా పాలనలో రహదారులపై చేసిన ఖర్చు రూ.15కోట్లే' - రాష్ట్ర రహదారులపై తెదేపా నేత పట్టాభి కామెంట్స్
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో చేసిన ఖర్చు కేవలం రూ.15కోట్లు మాత్రమేనని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ విమర్శించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి మీడియా సాక్షిగా అసత్యాలు చెప్పారని పట్టాభి మండిపట్టారు.
కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్ల బిల్లులు చెల్లించకుండా.. మంత్రి పెద్దిరెడ్డికి చెందిన ఒక్క పీఎల్ఆర్ సంస్థకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. బిల్లులు చెల్లించకుండా నిధుల్ని మళ్లిస్తున్నందుకు గుత్తేదారులు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తున్నారని తెలిపారు. సీఎం సమీక్షపై మంత్రి.. మీడియా ముందు అసత్యాలు చెప్పారని దుయ్యబట్టారు. తెదేపా ప్రభుత్వ హయాంలో పీఎంజీఎస్వై కింద 2634కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేసినట్లు స.హ.చట్టం చెప్తుంటే.. కేవలం 330కిలోమీటర్లు మాత్రమేనని మంత్రి అంటున్నారు. వాస్తవాలను పక్కన పెట్టి మీడియా సాక్షిగా ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని పట్టాభి మండిపడ్డారు.
ఇదీ చదవండి..LOKESH LETTER: వినాయక పండగకు విఘ్నాలు కల్పించడం సరికాదు: లోకేశ్