అంబులెన్స్‌ల పేరుతో వైకాపా ప్రభుత్వం దోచుకుందని తెదేపా నేత పట్టాభి ఆరోపించారు. సాక్ష్యాలు, ఆధారాలతో సహా 108, 104 అంబులెన్స్ లకు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందు ఉంచినట్లు తెలిపారు. వాస్తవాలను ప్రజలకు తెలిపినందుకే తనకు నోటీసులు ఇచ్చారని పట్టాభి విమర్శించారు. యనమలను విమర్శించే అర్హత బుగ్గనకు లేదని మండిపడ్డారు. తప్పుడు లెక్కలతో మీడియా ముందుకు వచ్చి కామెడి స్క్రిప్టులు ప్రదర్శించడం బుగ్గనకు అలవాటేనని ఎద్దేవా చేశారు. సూట్‌కేసు కంపెనీలతో రాష్ట్ర ఖజానాను దేశం దాటిస్తున్నారని ఆరోపించారు.
కామెడి స్క్రిప్టులు ప్రదర్శించడం బుగ్గనకు అలవాటే: పట్టాభి - మంత్రి బుగ్గనపై పట్టాభి కామెంట్స్
వైకాపా నాయకుల తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి స్పష్టం చేశారు. అంబులెన్స్‌ల పేరుతో వైకాపా ప్రభుత్వం దోచుకున్నది వాస్తవమేనని దుయ్యబట్టారు.
tdp leader pattabhi on minister buggana