ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పిటిషనర్ వాదనలను అదనపు ఏజీ ఎలా సమర్ధించారు: పట్టాభి - సరస్వతి ఇండస్ట్రీస్ భూ కేటాయింపులపై పట్టాభిరాం కామెంట్స్​

Pattabhi on Saraswathi Industies lands: సరస్వతి ఇండస్ట్రీస్ భూ కేటాయింపుల్లో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనకు అదనపు ఏజీ ఎలా సమర్ధించారని తెదేపా నేత పట్టాభిరాం ప్రశ్నించారు. సంస్థకు జరిగిన భూ కేటాయింపుల్లో 25ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని 2012లో ఆ సంస్థ యాజమాన్యమే తెలిపిందని పట్టాభి గుర్తుచేశారు.

tdp leader pattabhi
tdp leader pattabhi

By

Published : Jun 22, 2022, 6:59 PM IST

Saraswathi Industies lands allocations: సరస్వతి ఇండస్ట్రీస్​కు జరిగిన భూ కేటాయింపుల్లో.. 25ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ఆ విషయాన్ని 2012లో పర్యావరణ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులో ఆ సంస్థ యాజమాన్యమే వెల్లడించిందని పట్టాభి గుర్తుచేశారు. ఆ ఇండస్ట్రీస్​కు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ భూమి లేదన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను.. అదనపు ఏజీ ఎలా సమర్ధించారని పట్టాభి ప్రశ్నించారు. ఇండస్ట్రీస్ మైనింగ్ లీజులకు సంబంధించిన కేసులో పిటిషనర్, కరెస్పాండెంట్ ఇద్దరూ కుమ్మక్కయ్యారని హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వాస్తవం అనేందుకు అనేక రుజువులు ఉన్నాయన్నారు.

న్యాయస్థానాన్ని సైతం జగన్ రెడ్డి తప్పుదోవ పట్టించారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరస్వతి సిమెంట్ కంపెనీకి నీటి కేటాయింపుల్లోనూ కేంద్ర పర్యావరణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులకంటే.. రెండింతలు ఎక్కువ నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఎలా జారీ చేశారని నిలదీశారు. 5ఏళ్ల కాలపరిమితి ఉన్న జీవోను జీవితకాలానికి మార్చుకోవడాన్ని పట్టాభి తప్పుబట్టారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details