ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pattabhi fires on YSRCP: కేంద్ర ఆర్థికశాఖ రాసిన లేఖ జగన్ సర్కార్‌కి చెంపపెట్టు:పట్టాభి - తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి

Pattabhi fires on YSRCP: రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడంవల్ల ఖజానా పూర్తిగా దివాళా తీసిందని.. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. డ్రా చేసిన సొమ్ములకు లెక్కలు చెప్పాలని.. కేంద్రం రాసిన లేఖ.. జగన్ సర్కార్‌కు చెంపపెట్టని విమర్శించారు.

tdp leader pattabhi fires on ysrcp on financial issue
వైకాపాపై తెదేపా నేత కొట్టాభి ఆగ్రహం

By

Published : Jan 23, 2022, 3:42 PM IST

Pattabhi fires on YSRCP:రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడంవల్ల ఖజానా పూర్తిగా దివాళా తీసిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ధ్వజమెత్తారు. గతంలో వివిధ బ్యాంకుల నుంచి అడ్వాన్సుల రూపంలో డ్రా చేసిన సొమ్ములకు తక్షణమే లెక్కలు చెప్పాలని.. కేంద్ర ఆర్థికశాఖ రాసిన లేఖ.. జగన్ రెడ్డి సర్కార్‌కు చెంపపెట్టని విమర్శించారు. ఈ లేఖ ద్వారా.. రోడ్లు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో చేసిన దోపిడి స్పష్టమవుతోందని ఆరోపించారు. ఆర్థిక అరాచకత్వంపై కేంద్రం ఇంత తీవ్రంగా స్పందించడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదని.. ఇందుకు ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలని.. పట్టాభిరాం అన్నారు.

ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల ఖజానా దివాళా తీసింది:పట్టాభి

ABOUT THE AUTHOR

...view details