ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడితే తెదేపా చూస్తూ ఊరుకోదు' - tdp leader pattabhi

హింసా, బెదిరింపులతో బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడితే తెదేపా చూస్తూ ఊరుకోదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి హెచ్చరించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యలపై ఎస్ఈసీ స్పందించి చర్యలు తీసుకోవాలని పట్టాభి డిమాండ్ చేశారు.

tdp leader pattabhi
బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడితే తెదేపా చూస్తూ ఊరుకోదు

By

Published : Jan 26, 2021, 10:18 PM IST

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేయిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఎస్ఈసీ స్పందించి చర్యలు తీసుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి డిమాండ్ చేశారు. గత ఏడాదిలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా ప్రభుత్వ అండతో వైకాపా రౌడీ మూకలు బలవంతపు ఏకగ్రీవాలకు బరితెగించాయని... ఇప్పుడూ అదే పంథం అనుసరించేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు.

కేంద్ర బలగాల సాయంతో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవాలని కోరారు. హింసా, బెదిరింపులతో బలవంతపు ఏకగ్రీవాలకు సిద్ధమైతే తెదేపా చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తెదేపా సానుభూతిపరులు, కార్యకర్తలు ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారని సజ్జల తెలుసుకోవాలని హితవుపలికారు.


ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం పెంపు.. ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details