"జగన్ రెడ్డి హవాలాతో రాష్ట్రం దివాలా తీసే దుస్థితి తలెత్తింది" అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆదాయం పెంచకుండా సొంత ఆదాయం పెంచుకుంటున్నారని ఆరోపించారు. రెండేళ్లలో జగన్ రెడ్డి, ఆయన అనుచరుల కంపెనీలు కళకళలాడుతుంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం రోజురోజుకూ దిగజారిపోతోందని మండిపడ్డారు.
"రాంకీ షేర్ విలువ ఏడాది కాలంలో 442 శాతం పెరిగింది. జగన్ రెడ్డి సొంత కంపెనీ భారతీ సిమెంట్స్ ప్రధాన వాటాదారు అయిన వైకాట్ అనే ఫ్రెంచ్ కంపెనీ తొలి త్రైమాసికంలోనే 42శాతం వృద్ధి సాధించింది. దీని విలువ రూ.800కోట్లు. సిమెంట్ బస్తాను రూ.450 వరకూ పెంచినందుకే వైకాట్ అంత వృద్ధి నమోదు చేసింది. విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన అరబిందోకు రాష్ట్రంలోని 3 ప్రధాన పోర్టులు, అంబులెన్సులు దోచిపెట్టారు. హెటిరోకు విలువైన భూములు బోనస్‌గా ఇచ్చారు. గత రెండేళ్లలో జగన్ రెడ్డి, అతని అనుచరుల సంస్థల్లో లాభపడనది ఏదీ లేదు" - పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిధి
బ్యాంకులు షరతులు విధించే పరిస్థితి ఏర్పడింది..