సలాం కుటుంబసభ్యుల మృతదేహాలకు.. సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం నిర్వహించాల్సిన అవసరమేంటని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా సూర్యాస్తమయం తర్వాత శవపరీక్ష నిర్వహించరని.. నిజాలను కనుమరుగు చేసేందుకే ఇలా చేశారని ఆరోపించారు. నిందితులను కాపాడేందుకే అధికారులు హడావిడిగా పనులన్నీ చేశారని పట్టాభి అన్నారు.
'సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం ఎందుకు నిర్వహించారు'
సామూహిక ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబసభ్యుల మృతదేహాలకు పోస్టుమార్టం జరిపిన తీరుపై తెదేపా నేత పట్టాభి అనుమానం వ్యక్తంచేశారు. సాయంత్రం తర్వాత ఎందుకు హడావిడిగా శవపరీక్ష నిర్వహించారని ప్రశ్నించారు. ఎవరిని కాపాడ్డానికి ఇలా చేశారని పోలీసులను నిలదీశారు.
పట్టాభిరామ్, తెదేపా అధికార ప్రతినిథి