ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ మంత్రి, అతడి కుమారుడు.. ఆ సొమ్ము కాజేయాలనుకుంటున్నారు' - ఆర్​అండ్​బీ స్కామ్​పై పట్టాభి కామెంట్స్

ఆర్ అండ్ బీ ప్రాజెక్టులకు సంబంధించి కుంభకోణం బయటపెడుతున్నట్లు తెదేపా అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

tdp leader pattabhi about R&B_scam
tdp leader pattabhi about R&B_scam

By

Published : Sep 9, 2020, 12:58 AM IST

రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం 6,400 కోట్లతో ప్రణాళికలు వేసి, అందులో 70 శాతం నిధులను న్యూడెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) నుంచి రుణంగా తీసుకుందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి వెల్లడించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని బ్రిక్స్ దేశాల గ్రూప్ సామూహికంగా ఏర్పాటు చేసుకున్నారని.. 2019లో రాష్ట్రప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన ఎన్డీబీ, గడచిన నాలుగేళ్లలో ఏపీ సాధించిన ప్రగతి చూసే తాము రుణం ఇచ్చిందన్నారు. రాయలసీమకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధి అయిన ఆయన కొడుకు కలిసి ఎన్ డీబీ సొమ్ముని కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. 7 జిల్లాల్లో 1766 కోట్లకు ఈ ప్రొక్యూర్ మెంట్ విధానంలో టెండర్లు పిలిచారన్న పట్టాభి పూర్తిగా ఆన్ లైన్ విధానంలో జరగాల్సిన టెండర్ల ప్రక్రియలో బై హ్యాండ్ ద్వారా టెండర్ పత్రాలు ఎందుకు ఎస్ఈ కార్యాలయాలకు పంపాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

కాంట్రాక్టర్లను బెదిరించడానికే బై హ్యాండ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని పట్టాభి స్పష్టం చేశారు. 6,400కోట్ల టెండర్లను తన సొంత కంపెనీలకు, అనుచరుల కంపెనీలకు కట్టబెట్టడానికే అలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కంపెనీలు రాకుండా చేసి, స్థానిక కంపెనీలను బెదిరించి, కాంట్రాక్ట్ మొత్తం తనవారికే కట్టబెట్టాలని జగన్ ప్రభుత్వం చూసిందని మండిపడ్డారు. కాంట్రాక్ట్ మొత్తాన్ని పెద్దప్యాకేజీగా మార్చి, చిన్నచిన్న కాంట్రాక్టర్లకు అందుబాటులో లేకుండా ఎందుకు చేశారని నిలదీశారు. టెండర్ విలువలో 40 శాతంగా ఉన్న టర్నోవర్ విలువను 80 శాతంగా ఎందుకు మార్చారని ధ్వజమెత్తారు. ఏపీలో మాత్రమే కండీషన్లు మార్చి, పిచ్చిపిచ్చి నిబంధనలు పెట్టి, జీవో నెం-303ద్వారా జిల్లాలవారీగా పంచిపెట్టారని పట్టాభి ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details