చంద్రబాబు సొంత జిల్లాలో పర్యటిస్తే వైకాపాకు వచ్చిన నష్టం ఏంటని.. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. జిల్లా మంత్రి పెద్దిరెడ్డికి చంద్రబాబు అంటే ఎందుకు అంత భయమని నిలదీశారు. సీఎంపై డీజీపీ స్వామి భక్తి చాటుకుంటున్నారని విమర్శించారు. ప్రజా కోర్టులో జగన్కు శిక్ష తప్పదని హెచ్చరించారు. వైకాపా బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
చిత్తూరులో చంద్రబాబు పర్యటిస్తే వైకాపాకు వచ్చిన నష్టమేంటి..? - తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ వార్తలు
రేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవటంపై.. తెదేపా నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. చంద్రబాబు సొంత జిల్లాలో పర్యటిస్తే వైకాపాకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్రించారు.
![చిత్తూరులో చంద్రబాబు పర్యటిస్తే వైకాపాకు వచ్చిన నష్టమేంటి..? tdp leader panchumarthi anuradha fires on ycp about detaining chandrababu at renigunta airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10825502-372-10825502-1614596973474.jpg)
చంద్రబాబు చిత్తూరులో పర్యటిస్తే వైకాపాకు వచ్చిన నష్టమేంటి..?