చంద్రన్న పండుగ కానుకలు ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి జగనన్న పస్తుల పథకం ప్రవేశపెట్టారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ విమర్శించారు. సంక్షేమం మాటున మోసకారి పథకాలు అమలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక్కో కుటుంబంపై రెండున్నర లక్షల అప్పుల భారం మోపారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి నినాదం ఒక్కటే.. దోచేది కొండంత- ఇచ్చేది గోరంత' అని అనూరాధ విమర్శించారు.
పేదలు కడుపునిండా తిండి తినడం జగన్ రెడ్డికి ఇష్టం లేదని అనురాధ మండిపడ్డారు. ఓ మంత్రే రేషన్ బండిలో మామూళ్లు వేయమని డబ్బా పెట్టారంటేనే వైకాపా వారెంతలా దిగజారారో అర్ధమవుతోందన్నారు. తుగ్లక్ పాలనకు చరమగీతం పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పంచుమర్తి అనురాధ అన్నారు.