ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిని చంపేయటం వల్లే దుష్పరిణామాలు: నిమ్మల రామానాయుడు - nimmala ramanaidu news

అమరావతిని నీరుగార్చే ప్రయత్నాల వల్లే రాష్ట్రంలో యువతకు ఉపాధి కరవైందని తెదేపా నేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. కరోనా పరీక్షలు తక్కువ సమయంలో వచ్చేలా చూసి ప్రజల ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

nimmala ramanaidu on cm jagan
అమరావతిని చంపేయటం వల్లే దుష్పరిణామాలు

By

Published : May 11, 2021, 3:42 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపేశారని, అందువల్లే విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. సీఎం నిర్వాకం వల్లే పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రజలకు వైద్యం దొరకట్లేదంటూ మండిపడ్డారు. మంత్రులు, వైకాపా నేతలు తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేయించుకోవటంపై పెట్టిన శ్రద్ధ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పెట్టారా అంటూ నిలదీశారు.

'ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రజల మరణాలకు కారణం'

పారాసిటమాల్, బ్లీచింగ్, సహజీవనం అంటూ మొదటి నుంచి సీఎం కరోనాను తేలిగ్గా తీసుకోవటం వల్లే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో రావాల్సిన కరోనా ఫలితాలు వారం రోజులైనా రాకపోవటం వల్ల వ్యాధి ముదిరి రోగులు మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రెండో దశ ఇంత ఉద్ధృతంగా ఉండటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని రామానాయుడు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details