13 జిల్లాల రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఆదాయం వచ్చే అమరావతిని వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. 3 ముక్కలు చేయడం ద్వారా అమరావతిపై లక్షల కోట్ల ఆదాయాన్ని మాయం చేశారని ధ్వజమెత్తారు. విద్య, ఆరోగ్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా గత ప్రభుత్వం అమరావతిని రూపొందించిందని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డే అమరావతిని నిర్మిస్తారని చెప్పిన వారంతా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. చంద్రబాబు సవాల్‌ను స్వీకరించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని ప్రజలకు అర్థమైందన్నారు. సత్యం, ధర్మం తప్పడం వల్లే జగన్‌ను ఓటమి భయం వెంటాడుతోందన్నారు.
ఆదాయం తెచ్చే అమరావతిని నాశనం చేస్తున్నారు: నిమ్మల - నిమ్మల రామానాయుడు వార్తలు
సత్యం, ధర్మం తప్పడంవల్లే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులపై ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నారని తెదేపా నేత నిమ్మల రామానాయుడు అన్నారు. లక్షల కోట్ల ఆదాయం తెచ్చే అమరావతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
నిమ్మల రామానాయుడు