Nimmala on Polavaram R&R Package: అసమర్థతో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్ని ముంచేసిన జగన్, ఇప్పుడు ఆదుకుంటానంటూ డ్రామాలాడుతున్నారని.. తెదేపా శాసనసభాపక్ష ఉపనేత రామానాయుడు విమర్శించారు. పునరావసం ప్యాకేజీపై జగన్ రెడ్డి బూటకపు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలు, ఇతర సందర్భాల్లో కేంద్రాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేదని మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు తక్షణమే పునరావాసం ప్యాకేజీని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
పోలవరం నిర్వాసితులకు రూ.10 కూడా ఇవ్వలేదు: నిమ్మల - ap latest news
NIMMALA: పునరావాసం ప్యాకేజీపై జగన్ రెడ్డి బూటకపు వ్యాఖ్యలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు 10లక్షల పరిహారం ఇస్తానని చెప్పి.. 10 రూపాయలు కూడా సాయం చేయలేదన్నారు.
NIMMALA
నిర్వాసితులకు రూ.10లక్షల పరిహారం ఇస్తానని చెప్పి.. 10రూపాయలు కూడా సాయం చేయలేదన్నారు. ముందుగా వస్తే.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని సీఎం చెప్పటం అసమర్థతను కప్పిపుచ్చుకోవటమేనన్నారు. సీడబ్యూసీ ముందుగానే హెచ్చరించినా సహాయకచర్యలు చేపట్టకుండా మొద్దు నిద్రపోయారని రామానాయుడు విమర్శించారు.
ఇవీ చదవండి: