కరోనా నివారణ చర్యలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తెదేపా నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. కొవిడ్ బాధితులు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి జగన్ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. మహమ్మారి పెరుగుతున్నా గోదావరి జిల్లాల్లో క్వారంటైన్ కేంద్రాలు మూసేశారని మండిపడ్డారు. ప్రభుత్వ వైద్యం రోగులకు సరిగా అందడం లేదని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
'కరోనా బాధితులు కష్టాల్లో ఉంటే సీఎం జగన్ కాలక్షేపం చేస్తున్నారు' - నిమ్మల రామానాయుడు తాజా వార్తలు
ఆరోగ్యశ్రీ కింద కరోనా బాధితులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని తెదేపా నేత నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం కరోనా నివారణ చర్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు.
నిమ్మల రామానాయుడు, తెదేపా నేత