అమరావతికి శంకుస్థాపన జరిగి నేటితో ఐదేళ్ల కాలం పూర్తయిన నేపథ్యంలో... కేంద్రం కలగ జేసుకోవాలని తెదేపా విజయవాడ పార్లమెంటు కన్వీనర్ నెట్టెం రఘురాం, పార్టీ కోశాధికారి శ్రీరాం తాతయ్య కోరారు. 300 రోజులు పైగా అమరావతి రైతుల ఉద్యమం కొనసాగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
అమరావతిపై కేంద్రం కలగజేసుకోవాలి : నెట్టెం రఘురాం - అమరావతి రైతుల ఆందోళనలు వార్తలు
అమరావతి శంకుస్థాపనకు ఐదేళ్లు పూర్తైన సందర్భంగా...కేంద్రం రాజధాని సమస్యపై కలగజేసుకోవాలని తెదేపా విజయవాడ పార్లమెంట్ కన్వీనర్ నెట్టెం రఘురాం అన్నారు. అమరావతి ఉద్యమాన్ని వైకాపా ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. అమరావతి అభివృద్ధి నిలిచిపోవడంతో...ఆంధ్రుల ప్రగతి రథచక్రాలు ఆగిపోయాయని పేర్కొన్నారు.

nettam raghu ram
ఆంధ్రులు ప్రగతి కోసం అమరావతిని రాజధానిగా చేస్తే..వైకాపా రాజధానిని నీరుగార్చిందని విమర్శించారు. 16 నెలల పాటు సాగిన రాజధాని పనులు నిలిచిపోయాయన్నారు. అమరావతి నిలిచిపోవడంతో.. ఆంధ్రుల ప్రగతి రథచక్రాలు ఆగిపోయాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :తెలంగాణ: దీక్షిత్ కిడ్నాప్ నుంచి హత్య వరకు.. అసలేం జరిగింది?