వైకాపా పాలనలో 500 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. ఒక్క కేసులోనూ నిందితులకు శిక్ష పడలేదని ఆయన మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించాలని వివిధ రూపాల్లో తెదేపా ఆందోళనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు.
ప్రచార ఆర్భాటం తప్ప కార్యాచరణ లేదన్న లోకేశ్.. అందుకే అఘాయిత్యాలు పెరిగాయని అన్నారు. అమ్మాయిలపై జరిగిన అన్యాయాలను తెదేపా, ఐటీడీపీ వేదికగా ప్రశ్నిస్తామని లోకేశ్ వెల్లడించారు. మహిళల భద్రతకు తీసుకున్న చర్యలేమిటో నిలదీస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.