ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్య సిబ్బంది... ప్రజలు ఏమైపోయినా పర్వాలేదా? - lokesh twitter news

తాము బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లు వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. కరోనాపై పోరుకు ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు.

వైకాపా నేతల తీరుపై నారా లోకేష్ విమర్శలు
వైకాపా నేతల తీరుపై నారా లోకేష్ విమర్శలు

By

Published : Apr 3, 2020, 4:25 PM IST

వైకాపా నేతల తీరుపై నారా లోకేష్ విమర్శలు

తాము బాగుంటే చాలు వైద్య సిబ్బంది, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లు వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని తెదేపా నేత నారా లోకేష్ విమర్శించారు. డాక్టర్లకు ఇచ్చిన మాస్కులు వైకాపా నాయకులు తీసుకోవడం దారుణమన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతంత మాత్రమేనని దుయ్యబట్టారు. కరోనాపై పోరుకు ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నా ప్రభుత్వం అరకొర నిధులు విడుదల చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. కరోనా నివారణకు నిధులు లేవని అధికారులు లేఖలు రాస్తున్నారంటే... ఎంత ఘోరమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోచ్చని ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలో ఈ పరిస్థితికి జగనే కారణం: లోకేష్

ABOUT THE AUTHOR

...view details