వైకాపా నేతలు కోవిడియట్స్లా వ్యవహరిస్తున్నారని.. తెదేపా(tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) విమర్శించారు. సూపర్ స్పైడర్లుగా విచ్చలవిడిగా తిరుగుతుంటే వర్తించని కొవిడ్ నిబంధనలు.. వినాయక చవితికే వర్తిస్తాయా అని నిలదీశారు.
"కడప జిల్లా ప్రొద్దుటూరులో కనీసం కొవిడ్ నిబంధనలు పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే నిర్వహించిన కార్యక్రమానికి.. సజ్జల రెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. మీ నాన్న జయంతి, వర్ధంతి, మీ వివాహ వార్షిక వేడుకలు, వైకాపా నాయకుల వ్యక్తిగత కార్యక్రమాలకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు.. ఒక్క వినాయక చవితికి మాత్రమే అడ్డొచ్చాయా జగన్ రెడ్డీ" -నారా లోకేశ్