హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న వైకాపా నేతలకు జైలు జీవితం తప్పదని నారా లోకేశ్ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బెదిరింపులకు లొంగలేదని కర్నూలు జిల్లా నిడ్జూరు గ్రామానికి చెందిన తెదేపా నేత కురవ శ్రీనివాసులును అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. తెదేపా కార్యకర్తలను హత్య చేయించి తాడేపల్లి ప్యాలెస్లో ఆనందం పొందుతున్న ముఖ్యమంత్రి జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. హత్యకు గురైన కురవ శ్రీనివాసులు కుటుంబానికి తెదేపా అన్నివిధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
వైకాపా నేతలకు జైలు జీవితం తప్పదు: లోకేశ్ - kurnool district crime
వైకాపా నేతల తీరుపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో తలవంచలేదన్న కారణంతోనే కర్నూలు జిల్లాకు చెందిన తెదేపా నేత శ్రీనివాసులును హత్య చేశారని ఆరోపించారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్