2.30 లక్షల ఉద్యోగాల హామీపై మాట తప్పిన ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా.. నిరుద్యోగులు చేస్తున్న శాంతియుత ఆందోళనలను ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి.. జాబ్ క్యాలెండర్ విడుదల కోసం ఉద్యమిస్తున్నాడనే కక్షతో బైండోవర్ చేయడం దారుణమని అన్నారు. ఇలా చేయడం రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కుల్ని గొంతు నులిమేయడమేనని మండిపడ్డారు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడటం జగన్ రెడ్డికి తగదని హెచ్చరించారు. ఉద్యమించినోళ్ల గొంతులు ఎన్నాళ్లు ఇలా నొక్కేస్తారని ట్విట్టర్లో నిలదీశారు.
LOKESH: 'నిరుద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది'
వైకాపా ప్రభుత్వ(YCP government) వైఖరిపై తెదేపా నేత నారా లోకేశ్(TDP leader nara lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. మాట తప్పిన ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్టు(arrest) చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఉద్యమించిన వారి గొంతులు ఎన్నాళ్లు ఇలా నొక్కేస్తారని ప్రశ్నించారు.
తెదేపా నేత నారాలోకేశ్