సంగం డెయిరీని ఏమీ చేయలేక డైరెక్టర్ల సమావేశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు పెట్టాల్సి వస్తే, మాస్కు ధరించకుండా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం పై రోజుకో కేసు నమోదు చేయాలని ఆక్షేపించారు. అక్రమాలకు పాల్పడిన నేతలపై కేసులు పెట్టకుండా... ఇదేమని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఆనందయ్య మందును అనధికారికంగా అమ్ముకుందామనే ప్లాన్ను బయట పెట్టిన తెదేపా నేత సోమిరెడ్డి పై మరో తప్పుడు కేసు పెట్టారని లోకేశ్ మండిపడ్డారు.
సంగం డెయిరీని ఏమీ చేయలేక తప్పుడు కేసులు పెడుతున్నారు : లోకేశ్
ముఖ్యమంత్రి జగన్పై తెదేపా నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగం డెయిరీని ఏమీ చేయలేక తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మాస్కు ధరించకుండా సమీక్షలు నిర్వహిస్తున్న సీఎంపై రోజుకో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
సంగం డెయిరీని ఏమీ చేయలేక తప్పుడు కేసులు పెడుతున్నారు : లోకేశ్