ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భద్రత- భవిష్యత్ కోసం మహిళలు సాగించే పోరాటానికి అండగా ఉంటా: నారా లోకేశ్ - nara lokesh on naari sankalpa yatra

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహిళలు తలపెట్టన నారీ సంకల్ప దీక్షకు తన మద్దతు ప్రకటిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మద్యం విషయంలో మాట మార్చటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నారా లోకేశ్
nara Lokesh

By

Published : Jan 29, 2022, 3:44 PM IST

మహిళా ద్రోహిగా సాగుతున్న పాలనకు వ్యతిరేకంగా.. ఈనెల 31న తెదేపా కేంద్ర కార్యాలయంలో తలపెట్టిన నారీ సంకల్ప దీక్షకు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు నారా లోకేశ్ స్పష్టం చేశారు. తెలుగు మహిళా ఆధ్వర్యంలో జరగనున్న దీక్షకు మద్దతు ప్రకటించారు. భద్రత - భవిష్యత్ కోసం మహిళలు సాగించే పోరాటానికి అండగా ఉంటానని లోకేశ్‌ హామీ ఇచ్చారు. నారీ సంకల్ప దీక్షకు సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాకు జత చేశారు.

అకృత్యాలకు హద్దేది..?

రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలపై కురిపించిన ఆప్యాయత ఎక్కడికి పోయింది జగన్‌గారూ? అంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ముఖ్యమంత్రిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజుకో దుర్మార్గుడు ఆడబిడ్డలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలపై ఆకృత్యాలు పెరుగుతున్నా.. సీఎం జగన్ పట్టించుకున్న దాఖలాల్లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో బాగుండటం దేవుడెరుగు.. బతికి ఉండటమే అదృష్టంగా భావించే దురదృష్ట రోజులు దాపురించాయని విమర్శించారు. పట్టపగలు రోడ్డున మహిళలు నడవలేని దుస్థితి నెలకొందని వాపోయారు.

జగన్ సార్ మాట తప్పారు..

ఎన్నికలకు ముందు.. మద్యపాన నిషేధిస్తానంటూ మహిళలకు వరమిస్తున్నానని చెప్పి.. అధికారంలోకి వచ్చాక సొంతంగా మద్యం విక్రయించడంపై సమాధానం చెప్పాలంటూ నిలదీశారు.

ఇదీ చదవండి:Employees Relay fasting initiations : ప్రభుత్వం తెచ్చిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలి...

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details