తీవ్ర వాదులతో వైకాపా నాయకులు చేతులు కలిపి డ్రగ్స్ మాఫియా చేస్తున్నారని తెదేపా నేత నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్టులో ఏ వ్యాపారం చేయడానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారో సమాధానం చెప్పాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
పశ్చిమ ఆఫ్రికాలోని ఐవరీ కోస్టులో వ్యాపారం ప్రారంభించేందుకు వెళ్లానని ద్వారంపూడి.. మీడియా సమావేశంలో చెప్పటం అనుమానించాల్సిన విషయమన్నారు. అక్రమ సంపదతో ఆటలాడుకుంటూ దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తున్న వైకాపా తీరుపై కేంద్రం జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని నల్లమిల్లి కోరారు.
"ఏటా రూ.3లక్షల కోట్ల హెరాయిన్ అక్రమ వ్యాపారానికి ఐవరీ కోస్టు ప్రసిద్ధి. అక్కడ ద్వారంపూడి ఏ వ్యాపారం ప్రారంభించేందుకు వెళ్లారు? ఆషీ ట్రేడింగ్ కంపెనీ స్థాపించిన సుధాకర్.. కాకినాడలో ద్వారంపూడి బినామీ అయిన అలీషా మెరైన్ సంస్థలో గుమస్తాగా పనిచేశారు. వైకాపా నేతలు ఉగ్రవాదులతో ఉమ్మడి డీల్ కుదుర్చుకుని జాతిని నిర్వీర్యం చేస్తున్నారు. ఇప్పటికే మాదకద్రవ్యాలు, ఎర్రచందనం, గంజాయి, గుట్కా, బియ్యం, తలనీలాల మాఫియాలకు రాష్ట్రాన్ని అడ్డాగా మార్చారు. అక్రమ సంపాదనతో ఆటలాడుకుంటూ దేశభద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తున్న వైకాపా నేతల తీరుపై కేంద్రం జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలి." -నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, తెదేపా నేత
ఇదీ చదవండి:డ్రగ్స్‌కు కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్: జీవీ ఆంజనేయులు