Nakka Letter to CM : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, మద్యం అమ్మకాల వల్లే మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. అక్రమ సంపాదన కోసం మన్యంలో గంజాయిని వాణిజ్య పంటగా మార్చుకున్న వైకాపా నేతలు.. అమాయకులైన గిరిజనుల్ని వేధింపులకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. చివరకు ఆన్లైన్లో కూడా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోందన్నారు. తెదేపా తరపున ప్రశ్నిస్తే నర్సీపట్నం నుంచి అర్ధరాత్రి తన ఇంటికి పోలీసుల్ని పంపి భయభ్రాంతులకు గురి చేశారని నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. పోలీసులే ఏకంగా 2 లక్షల కిలోల గంజాయి పట్టుకున్నారని, ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. దేశంలో ఏ మూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయన్న నక్కా... రాష్ట్ర యువత భవిష్యత్తుతో పాటు, రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 9వేల251 కోట్ల విలువైన 2 లక్షల కిలోల గంజాయిని కాల్చివేశామని పోలీసులు చెబుతున్నారని, దొరికిన గంజాయి ఇన్ని లక్షల్లో ఉంటే దొరకని గంజాయి లక్షల కిలోల్లో ఉంటుందని విమర్శించారు. గతంలో విశాఖ మన్యంలో వందల ఎకరాల్లో జరిగే గంజాయి సాగు, వైకాపా పాలనలో 15 వేల ఎకరాలకు విస్తరించిందని ఆరోపించారు.
Nakka Letter to CM : మద్యం, మాదక ద్రవ్యాల కారణంగానే మహిళలపై వేధింపులు - నక్కా ఆనందబాబు లేఖ - Nakka Anandababu's letter on liquor sales in the state
Nakka Letter to CM : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్, మద్యం అమ్మకాల వల్లే మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు. డ్రగ్ మాఫియాని నివారించి యువత భవిష్యత్ కాపాడాలని సీఎం జగన్‌కి ఆయన లేఖ రాశారు.

నక్కా ఆనందబాబు