Nakka Anandbabu fires on YSRCP: అసెంబ్లీ సాక్షిగా న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారని.. మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. అమరావతి విషయంలో సీఎం, మంత్రులు శాసనసభలో చేసిన వ్యాఖ్యల్ని.. ఆయన తప్పుబట్టారు. ఇది న్యాయవ్యవస్థను, రాజ్యాంగాన్ని అవమానించటమేనని అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు చేసే పొరపాట్లను సరిదిద్దేందుకే న్యాయవ్యవస్థ ఉందని స్పష్టం చేశారు.
Nakka Anandbabu: న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు సీఎం యత్నం: నక్కా ఆనంద్ బాబు - వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం
Nakka Anandbabu fires on YSRCP:అమరావతి విషయంలో సీఎం, మంత్రులు శాసనసభలో చేసిన వ్యాఖ్యల్ని.. తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు తప్పుబట్టారు. అసెంబ్లీ సాక్షిగా న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారని విమర్శించారు.
న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు సీఎం ప్రయత్నించారు: నక్కా ఆనంద్ బాబు
దేశ పార్లమెంట్ చేసిన రాష్ట్రవిభజన చట్టం ఆధారంగా అమరావతి ఏర్పడిందని అన్నారు. కోర్టు తీర్పుని వక్రీకరిస్తూ మాకు శాసనాలు చేసే అధికారం లేదా అని ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదన్నారు. కోర్టు ఇచ్చిన బెయిల్పై బయటకు వచ్చి.. మళ్లీ ఆ కోర్టులనే తప్పుబడుతున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: