ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మళ్లీ గెలవలేరనే రాజీనామాలంటూ కొత్త డ్రామాలు: నక్కా ఆనందబాబు - తెదేపా నేత కళా వెంకట్రావ్​

Nakka Anandababu:మూడు రాజధానులపై అంశంలో సీఎం జగన్​, వైకాపా మంత్రుల వైఖరిపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్టులతో వికేంద్రీకరణ సమావేశాలు పెట్టిస్తున్నారని తెదేపా నేత నక్కా ఆనందబాబు అన్నారు. పదవులు కాపాడుకునేందుకే రాజధాని రైతులపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని కళా వెంకట్రావ్​ ఆరోపించారు. దానవులు చేసే దుష్టకార్యాలు... వైకాపా నేతలు చేస్తున్నారని యనమల దుయ్యబట్టారు.

Nakka Anandababu
దేపా నక్కా ఆనంద్ బాబు

By

Published : Oct 8, 2022, 12:30 PM IST

Updated : Oct 8, 2022, 1:37 PM IST

Nakka Anandababu: వికేంద్రీకరణ సమావేశాలు జగన్మహన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులతో నడిపించేవేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. మళ్లీ గెలవలేమని తెలిసే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాలంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి దుర్మార్గపు ఆలోచనలు అమలు చేయడానికి మంత్రులంతా మద్దతు పలకటం సిగ్గుమాలిన చర్యని మండిపడ్డారు. కాంగ్రెస్​లో ఉండగా జగన్మోహన్ రెడ్డిని ధర్మాన, బొత్స తిట్టినట్లు మరెవ్వరూ తిట్టలేదని గుర్తుచేశారు. విశాఖను జేగ్యాంగ్ దోపిడీకి అడ్డాగా మార్చుకుని ప్రజల్ని మభ్యపెట్టేయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విచ్ఛిన్నం కోసమే రాజధాని మార్పు అంశం ఎత్తుకున్నారని విమర్శించారు. ప్రాంతీయ, కుల తత్వాలు రెచ్చకొట్టేందుకే జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారా అని నిలదీశారు.

దేపా నక్కా ఆనంద్ బాబు

TDP leader Kala Venkatarao: ముఖ్యమంత్రి దగ్గర పదవులను కాపాడుకునేందుకే.. అమరావతి రైతులపై ఇష్టారాజ్యంగా మంత్రులు మాట్లాడుతున్నారని తెదేపా సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు అన్నారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు వెళ్తున్న రైతులపై మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్న కళావెంకట్రావు... దీనిపై గవర్నర్ స్పందించాలన్నారు. న్యాయబద్ధంగా చేస్తున్న పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు మానుకోవాలని కళావెంకట్రావు హితవు పలికారు.

TDP leader Yanamala Ramakrishna: మానవులు చేసే పనులు కాకుండా దానవులు చేసే దుష్టకార్యాలు వైకాపా నేతలు చేస్తున్నారని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఇదిగో కార్యాలయాలు వచ్చేస్తున్నాయి..అదిగో సీఎం వచ్చేస్తున్నారని మంత్రులు, వైకాపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలన్నీ ఉత్తరాంధ్ర భూముల దోపిడీ కోసమేనని ఆరోపించారు. అభివృద్ధి ముసుగులో వైకాపా చేస్తోంది ఉత్తరాంధ్ర భూదోపిడీ హింసా, విధ్వంసాలేనని విమర్శించారు. అమరావతి పాదయాత్రపై మంత్రులు, వైకాపా నాయకులు విమర్శలు చేయడం... రైతుల భూ త్యాగాలను అవమానించడమేనని మండిపడ్డారు.

రోడ్డున పడ్డ రైతులను దుర్భాషలాడటం రాక్షసత్వమని యనమల ఆక్షేపించారు. పరిపాలనా రాజధాని విశాఖ అనే ప్రచారాన్ని కూడా స్వార్థానికి వాడుకున్న నీచత్వం వైకాపా నేతలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉత్తరాన కలిపేశారన్న యనమల... భోగాపురం ఎయిర్ పోర్టు అటకెక్కించి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నిలిపేశారని దుయ్యబట్టారు. ఒక్క రోడ్డు, ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చకుండా 3 రాజధానులేం చేస్తారనే చర్చ సర్వత్రా ఉందన్నారు. ఉత్తరాంధ్ర తిరోగమనం చెందుతుంటే ఇక్కడి సీనియర్ మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. జగన్​కు డబ్బా కొట్టడానికే మంత్రి పదవులు తప్ప ఉత్తరాంధ్ర ప్రజల పట్ల బాధ్యత పట్టట్లేదని విమర్శించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 8, 2022, 1:37 PM IST

ABOUT THE AUTHOR

...view details