ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"వారికి నోటీసులు ఎందుకివ్వలేదు.. ఎస్సీ నేతననే అర్ధరాత్రి నా ఇంటికి వచ్చారా..?"

గంజాయి వ్యవహారంపై మాట్లాడినందుకు పోలీసులు నోటీసులు ఇచ్చిన తీరును తెదేపా నేత నక్కా ఆనంద్ బాబు తప్పుపట్టారు. ప్రతి పక్షాలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై నిగ్గు తేల్చాలన్నారు.

tdp leader nakka anand babu
tdp leader nakka anand babu

By

Published : Oct 28, 2021, 3:54 PM IST

గంజాయి సాగు, రవాణాపై మాట్లాడినందుకు అర్ధరాత్రి నర్సీపట్నం పోలీసులు ఇంటికొచ్చి నోటీసులిచ్చారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు చెప్పారు. ఆధారాలు సేకరించాలంటూ హంగామా సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ, ఎంపీ విజయసాయిరెడ్డికి ఎప్పుడు నోటీసులిస్తారని ప్రశ్నించారు. గంజాయి సాగుతో తెదేపా నేత నారా లోకేశ్ కు సంబంధం ఉందంటూ.. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజమెంతో డీజీపీ తేల్చాలని డిమాండ్ చేశారు.

మాదకద్రవ్యాలకు ఏపీ కేంద్రంగా మారిందంటూ జనసేనాధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎస్సీ నేతనైనందునే తనకు పోలీసులు నోటీసులు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. నర్సీపట్నం సీఐ, విశాఖ డీఐజీ తక్షణమే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయసాయి నుంచి వెంటనే ఆధారాలు సేకరించాలని అన్నారు. తెలంగాణకు గంజాయి ఏపీ నుంచే వస్తుందన్న.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, నల్గొండ ఎస్పీలకూ నోటీసులివ్వాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details