ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, అమరావతి గురించి మాట్లాడే అర్హత మంత్రి బొత్స సత్యనారాయణకు లేదని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో భూములమ్మితే ఎంత కమిషన్ వస్తుంది అనే విషయంపైనే ఆయన దృష్టి ఉందని ఎద్దేవా చేశారు. విశాఖను రాజధాని చేసే అంశంపై అమరావతి రైతులతో మాట్లాడేది లేదంటున్న బొత్స... మూడు రాజధానులు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
MARREDDY : 'అమరావతి గురించి మాట్లాడే అర్హత బొత్సకు లేదు' - marreddy srinivasareddy fire on botsa sathyanarayana about amaravathi capital issue
మంత్రి బొత్స సత్యనారాయణపై తెదేపా నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, అమరావతి గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు.
తెదేపా నేత మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి