అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేయడం లేదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు మండిపడ్డారు. ఎస్సీల అవకాశాలను, అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం సర్వనాశనం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్యపై లోకేశ్ విసిరిన సవాల్‌పై సీఎం ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. గతంలో హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక దోషులను ఎందుకు పట్టుకోవటం లేదని ప్రశ్నించారు.
క్షేత్రం అపవిత్రం కాకూడదనే వెంకన్న రానివ్వలేదు..
సొంత బాబాయిని చంపింది ఇంటిదొంగలేనని ముఖ్యమంత్రికి తెలుసునని మాణిక్యాలరావు ఆరోపించారు. తప్పుడు ప్రమాణాలతో తన క్షేత్రాన్ని అపవిత్రం చేస్తాడని ఏడుకొండలవాడే ముఖ్యమంత్రిని తిరుపతికి రాకుండా నిలిపేశారని చేశాడని అన్నారు. తిరుపతిని జగన్ బారినుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తిరుపతి పార్లమెంట్ ఓటర్లదేనని పేర్కొన్నారు.