స్వేచ్ఛాయుత వాతావరణంలో పురపాలక ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని పలు వార్డుల్లో ఓటర్లను బెదిరించటం, ప్రలోభ పెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిరంతరాయంగా వీడియో రికార్డింగ్ చేపట్టడంతో పాటు అదనపు భద్రతా బలగాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
'ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి' - andhrapradhesh latest news
రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా రాష్ట్ర కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు లేఖ రాశారు. ప్రశాంత వాతావరణంలో పురపాలక ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెదేపా రాష్ట్ర కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు లేఖ