తాలిబన్ల డ్రగ్స్(Lokesh on drugs)కు.. తాడేపల్లి ప్యాలస్‌కు ఉన్న సంబంధమేంటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(nara lokesh) నిలదీశారు. లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఇప్పుడు ఏపీని జగన్ రెడ్డి ఏకంగా డ్రగ్స్(drugs) డెన్‌గా మార్చేసారని మండిపడ్డారు. దేశంలో ఉన్న అత్యున్నత వ్యవస్థలన్ని రాష్ట్రంవైపు వేలు చూపిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని ఇతర రాష్ట్రాలను హెచ్చరిస్తుంటే డీజీపీ మాత్రం జగన్ భక్తిలో మునిగితేలుతున్నారని ఆరోపించారు. డ్రగ్స్ డాన్ని కాపాడేందుకు ప్రయత్నాలు ఆపి రాష్ట్ర పరువు కాపాడేందుకు శ్రద్ధ చూపాలని సూచించారు. మరో వైపు 'WhoIsDrugDonInAP' అనే హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్త ట్రెండింగ్‌లో నిలిచిందని నారా లోకేశ్ అన్నారు.
lokesh on drugs: తాలిబన్ల డ్రగ్స్‌కు.. తాడేపల్లి భవంతికి ఉన్న లింకేంటి?: నారా లోకేశ్ - lokesh on drugs
ముఖ్యమంత్రి జగన్.. లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఏపీని ఇప్పుడు ఏకంగా డ్రగ్స్(Lokesh on drugs) డెన్‌గా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. అత్యున్నత వ్యవస్థల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన డీజీపీ మాత్రం జగన్ భక్తిలో మునిగితేలుతున్నారని ఆరోపించారు.
నారా లోకేశ్