స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై తెదేపా మాజీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ మండిపడ్డారు. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం తమ్మినేని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపాకి రోజులు దగ్గర పడ్డాయన్న వారికే.. రోజులు దగ్గరపడ్డాయని కూన రవి కుమార్ హెచ్చరించారు. ఒకరిద్దరికి మంత్రి పదవులిచ్చినంత మాత్రాన బీసీలకు ఒరిగేదేంలేదన్న ఆయన.. వైకాపాను పడగొట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. వైకాపా తన చితికి తానే నిప్పు పెట్టుకుంటోందన్నారు.
వైకాపా పతనం ఖాయం : కూన రవికుమార్ - సభాపతి తమ్మినేని సీతారాంపై తెదేపా నేతల అగ్రహం
సభాపతి తమ్మినేని సీతారాంపై తెదేపా నేత కూన రవికుమార్ మండిపడ్డారు. తమ్మినేనిని ఆముదాలవలసలో సజీవంగా దహనం చేస్తారని ధ్వజమెత్తారు. తమ్మినేని పాడె మోయటనికి కూడా ఎవరు ఉండరన్నారు.
Kuna Ravikumar