ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్ష కరోనా మరణాలు: కూన రవికుమార్ - kuna on government false corona death numbers

రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్యను కావాలనే ప్రభుత్వం తక్కువగా చూపుతోందని తెదేపా నేత కూన రవికుమార్​ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలో మరణాలు తక్కువ చేసి చూపినట్లు ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇకనైనా తప్పుడు లెక్కలు మాని.. కొవిడ్ మృతులు, బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

kuna ravi kumar fired on ysrcp over corona death n umbers
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్ష కరోనా మరణాలు

By

Published : Jun 12, 2021, 4:38 PM IST

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో లక్ష కరోనా మరణాలు సంభవించాయని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. కొవిడ్ మృతులపై ప్రభుత్వం చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మే 14న ఆరుగురు చనిపోయారని ప్రకటించారని.. కానీ 32 మంది మరణించినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రమంతటా ఇదే తరహాలో వాస్తవాలను కప్పిపుచ్చుతున్నారని మండిపడ్డారు. కరోనాతో చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారంతో పాటు.. ఉపాధి కోల్పోయిన కోటి కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తప్పుడు లెక్కలు మానుకుని.. కొవిడ్ మృతుల బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details