ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"అభివృద్ధి చేతకాక.. ప్రజల్ని మభ్య పెట్టేందుకే మాటలు" - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

TDP KUNA: తెలంగాణ మంత్రి, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను తెదేపా నేత కూన రవికుమార్​ ఖండించారు. అభివృద్ధి చేయడం చేతకాక.. ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలవరంపై కేసీఆర్, జగన్ రెడ్డి ఇద్దరూ కలిసి డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KUNA RAVIKUMAR
KUNA RAVIKUMAR

By

Published : Jul 19, 2022, 7:12 PM IST

TDP KUNA: అభివృద్ధి చేయటం చేతకాక తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​, బొత్స సత్యనారాయణ.. ప్రజల్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ విమర్శించారు. పోలవరంపై కేసీఆర్, జగన్ రెడ్డి ఇద్దరూ కలిసి డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీన గ్రామాలపై బొత్స చేసినవి మతిలేని వ్యాఖ్యలని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుల్లో బొత్స ఒకరన్నారు. జగన్ రెడ్డికి ఏపీ ప్రయోజనాల కంటే.. తెలంగాణే ముఖ్యమని దుయ్యబట్టారు. తెలంగాణలో తన ఆస్తులు కాపాడుకోవటమే.. జగన్ రెడ్డికి ముఖ్యమని విమర్శించారు. వైకాపా ప్రభుత్వంలో పోలవరంలో అంగుళం పనులు కూడా జరగలేదని ఆక్షేపించారు.

ABOUT THE AUTHOR

...view details