ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. మీట నొక్కితే డబ్బులు సొంత మీడియాకు ప్రకటనల రూపంలో వెళ్తున్నాయి తప్పా.. రైతులకు మాత్రం సాయం దక్కట్లేదని తెదేపా సీనియర్ నేత కూన రవికుమార్ (tdp leader kuna ravi kumar on cm jagan) విమర్శించారు. గత రెండున్నరేళ్లలో ప్రకృతి వైపరీత్యాలకు రూ.17వేలకోట్ల మేర రైతులు నష్టపోతే.. వైకాపా ప్రభుత్వం కేవలం రూ.1070.56కోట్లు మాత్రమే చెల్లించిందని కూన రవికూమార్(kuna ravikumar on input subsidy) ఆరోపించారు.
'8 తుపాన్లకు 40లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగితే.. రైతులకు ఒక వంతు సాయం కూడా దక్కలేదు. గులాబ్ తుపాను వల్ల 3లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగితే కేవలం 34వేల ఎకరాలకు రూ.22కోట్ల పరిహారం చెల్లించి సరిపెట్టారు. సొంత మీడియాకు ప్రకటనల రూపంలో చెల్లించినంత మొత్తం కూడా రైతుల పరిహారానికి చెల్లించలేదు. రైతు భరోసా, ఇన్‌ఫుట్ సబ్సిడీ చెల్లింపులు(tdp leader kuna ravi kumar comments on input subsidy to farmers), వడ్డీలేని రుణాలు ఇలా అన్ని అంశాల్లోనూ రైతుల్ని మోసగించారు. రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి, రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి హామీలను ముఖ్యమంత్రి జగన్ విస్మరించారు' అని కూన రవి కుమార్ మండిపడ్డారు.