ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PATTABHI : 'ఇసుక టెండర్.. ఫిక్సింగ్ రాజా ఎవరో సీఎం చెప్పాలి' - sand tendering in andhrapradesh

ఇసుక టెండర్లపై వైకాపా సర్కారు అనుసరిస్తున్న విధానంపై తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక టెండర్లను జేపీ పవర్ వెంచర్​కు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

By

Published : Nov 11, 2021, 2:24 PM IST

రాష్ట్రంలో ఇసుక టెండర్లను జేపీ పవర్ వెంచర్‌కు కట్టబెట్టేందుకు తాడేపల్లి ప్యాలెస్‌ కేంద్రంగా ఫిక్సింగ్ జరిగిందని తెలుగుదేశం ఆరోపించింది. తెరవెనుక ఫిక్సింగ్ బాగోతం నడిపింది ఎవరో సమాధానం చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం డిమాండ్ చేశారు. ఫిక్సింగ్ వ్యవహారాల్లో వైకాపా అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నెలకొల్పొచ్చని ఎద్దేవా చేశారు.

జేపీ పవర్ వెంచర్‌కు ఇసుక టెండర్ల కోసం డమ్మీ కంపెనీలతో టెండర్లు వేయించారు. ఇసుక టెండర్ ఫిక్సింగ్ రాజా ఎవరనేది సీఎం చెప్పాలి. రూ.100 కోట్లు దాటినా జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపలేదు.

- కొమ్మారెడ్డి పట్టాభిరాం, తెదేపా అధికార ప్రతినిధి

తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details