పథకం ప్రకారమే ఈఎస్ఐ కుంభకోణం పేరుతో తెదేపా నేత అచ్చెన్నాయుడిపై దాడి మొదలు పెట్టారని తెదేపా నేత కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. బీసీలకు ఓ వైపు అన్యాయం చేస్తూ, నేతల ఎదుగుదలను అడ్డుకుని అక్రమంగా కేసు పెట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బలహీన వర్గాలను అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే ప్రతీ పని వైకాపా నాయకులకు అవినీతిమయంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.
'బీసీల అభివృద్ధిని సీఎం జగన్ అడ్డుకుంటున్నారు' - tdp leader kollu ravindra fires on jagan
బీసీలకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించినందుకే అచ్చెన్నాయుడిపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు.
తెదేపా నేత కొల్లు రవీంద్ర ధ్వజం