ఎన్నికలకు ముందు బీసీ సంక్షేమానికి ఏటా రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తానని జగన్ ఇచ్చిన హామీ ఏమైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర నిలదీశారు. చట్టబద్దత, నిధులు లేని 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లాభం ఏం ఉందని మండిపడ్డారు. విశ్వ విద్యాలయాల ఉపకులపతులు, తితిదే పాలకమండలిలో ఎంతమంది బీసీలకు ప్రాధ్యాన్యం కల్పించారన్నారు.
పనికిరాని పదవులతో బీసీల కడుపు నిండదు: కొల్లు రవీంద్ర - బీసీ కార్పొరేషన్లపై కొల్లు రవీంద్ర కామెంట్స్
వైకాపా ప్రభుత్వ సలహాదారులుగా ఎంత మంది బీసీలున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు ఖర్చు చేస్తానని ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. చట్టబద్దత, నిధులు లేని 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి లాభమేంటని ప్రశ్నించారు. పనికిరాని పదవులతో బీసీల కడుపు నిండదనే నిజాన్ని ప్రభుత్వం గ్రహించాలని కొల్లు రవీంద్ర హితవు పలికారు.
kollu ravindra
ప్రభుత్వ సలహాదారులుగా ఎంతమంది బీసీలున్నారని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. అమ్మఒడి, రైతుభరోసా, వైఎస్సార్ ఆసరా పథకాలు అందరితో పాటే బీసీలకు ఇస్తున్నారే తప్ప, వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదన్నారు. పనికిరాని పదవులతో బీసీల కడుపు నిండదనే నిజాన్ని ప్రభుత్వం గ్రహించాలని కొల్లు రవీంద్ర హితవు పలికారు.
ఇదీ చదవండి :రేపు అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయ బదిలీల్లో వెబ్ ఆప్షన్లు: మంత్రి సురేశ్