ఇంద్రకీలాద్రిపై పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని వాహనాన్ని ఘాట్ రోడ్డు ప్రారంభంలోనే పోలీసులు నిలిపివేశారు. స్థానిక ఎంపీగా ప్రోటోకాల్ పాటించకపోవడం పట్ల ఎంపీ నాని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలసి కేశినేని నాని కాలినడకనే ఇంద్రకీలాద్రిపైకి వెళ్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి నడిచి కిందకు వచ్చారు. వీఐపీ పాస్‌లతో ఇతర వాహనాలను అనుమతిస్తూ ఎంపీ వాహనాన్ని అడ్డుకోవడంపై ఎంపీ సహాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దుర్గమ్మను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు.
ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో ఎంపీ కేశినేని వాహనం నిలిపివేత - ఏపీ తాజా వార్తలు
బెజవాడ దుర్గమ్మను తెదేపా నేతలు దర్శించుకున్నారు. ఘాట్‌రోడ్డులో ఎంపీ కేశినేని నాని వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. ప్రోటోకాల్ పాటించలేదని పోలీసుల తీరుపై కేశినేని నాని అసహనం వ్యక్తం చేశారు. కుటుంబంతో కలిసి కాలినడకనే ఇంద్రకీలాద్రి పైకి వెళ్లారు. దుర్గమ్మను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు.
tdp leaders