ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడగింపు తగదని.. కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగానికి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ లేఖ రాశారు. జూన్ 30వ తేదీ నాటికి ఆదిత్యనాథ్‌దాస్ పదవీ విరమణ చేయాల్సి ఉందని గుర్తు చేస్తూ.. 2013లో జగన్మోహన్ రైడ్డిపై సీబీఐ నమోదు చేసిన క్విడ్ ప్రోకో కేసుల్లో ఆదిత్యనాథ్ దాస్ కూడా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
kanakamedala: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు తగదు: కనకమేడల - letter to DOPT for CS adhithyanath das
నేరారోపణలు ఉన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు తగదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల విభాగానికి తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్ లేఖ రాశారు. వ్యక్తిగత లాభాల కోసం సీఎస్.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వ సేవలు దుర్వినియోగం చేశారని వెల్లడించారు.
జలవనరుల శాఖ కార్యదర్శిగా.. ఇండియా సిమెంట్స్‌కు అనధికారికంగా 10లక్షల లీటర్ల నీటి కేటాయింపునకు అవసరమైన సహాయ సహకారాలు అందించారనే అభియోగాలు సీఎస్‌పై ఉన్నాయని కనకమేడల తన లేఖలో పేర్కొన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. సీఎ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆదిత్యనాథ్ దాస్‌పై కూడా సీబీఐ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిందన్న తెలిపారు. వ్యక్తిగత లాభాల కోసం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వ సేవలు దుర్వినియోగం చేసిన ఆదిత్యనాథ్ దాస్‌కు సీఎస్‌గా పదవీకాలం పొడిగింపు సరికాదని లేఖలో స్పష్టం చేశారు.
ఇదీచదవండి.