రాయలసీమ వేరుశనగ రైతుల(rayalaseema peanut farmers issues)కు న్యాయం చేయలేనప్పుడు జగన్.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండటానికి అనర్హులని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు కాలువ విమర్శించారు. ప్రకృతి శాపం, పాలకుల నిర్లక్ష్యం.. అనంతపురం జిల్లా వేరుశనగ రైతులకు కన్నీరే మిగిల్చిందని కాలువ(tdp leader kalva on Anantapur peanut farmers issues) ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది 12లక్షల20వేలఎకరాల్లో వేరుశనగ సాగుచేసిన రైతులు.. రూ. 3వేలకోట్ల విలువైన పంటను నష్టపోయారని.. ఇంతమొత్తంలో నష్టం జరిగితే జగన్ ప్రభుత్వం కనీసం రూ. 300కోట్లు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వ చేయూత లేకపోవడంతో వేరుశనగ రైతులు అప్పులపాలయ్యారని పేర్కొన్నారు. ఈ ఏడాది సాగువిస్తీర్ణం 2.50లక్షల ఎకరాలు తగ్గింది. దాదాపు 17 మందిరైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని.. ఇంత జరుగుతున్నా వ్యవసాయ మంత్రి, ముఖ్యమంత్రిలో చలనం లేదని కాలవ(tdp leader kalva srinivasulu) దుయ్యబట్టారు.
గతంలో తెదేపా హయాంలో ప్రకృతి సహకరించకపోయినా రైతులకు చంద్రబాబు అండగా ఉన్నారని.. రూ. 1126కోట్ల సహాయం అందించి రైతులను ఆదుకున్నట్లు గుర్తు చేశారు. అనంతపురం వేరుశన రైతుల వెతలపై ముఖ్యమంత్రికి లేఖ రాశామన్నారు. ఆయన స్పందించి రైతులను ఆదుకోవాలని(help to Anantapur peanut farmers).. లేనిపక్షంలో తెదేపా ఆధ్వర్యంలో రైతులతో కలిసి ప్రభుత్వంపై పోరాటానికి దిగుతామని కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు.