ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జయరాంను మంత్రివర్గం నుంచి తప్పించాలి: కాలవ శ్రీనివాసులు - ఈఎస్​ఐ స్కాం గురించి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలు

ఈఎస్​ఐ స్కాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి కారు తీసుకున్న మంత్రి జయరాంను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైకాపా నేతల అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు.

tdp leader kalva srinivasulu critcises ycp government
కాల్వ శ్రీనివాసులు, తెదేపా నేత

By

Published : Sep 21, 2020, 6:38 PM IST

Updated : Sep 21, 2020, 9:30 PM IST

ప్రజాధనం దోపిడీ లక్ష్యంగా రాష్ట్రంలో వైకాపా పాలన ఉందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఇసుక, మట్టి వైకాపా నాయకుల అవినీతికి ఆనడం లేదన్నారు. ఈఎస్ఐ స్కాంలో నిందితునిగా ఉన్న కార్తీక్ నుంచి మంత్రి జయరాం కారు తీసుకున్నారని మండిపడ్డారు. దాన్ని సాక్ష్యాలతో నిరూపించినట్లు ఆయన స్పష్టం చేశారు. మంత్రి అవినీతిపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటివరకు స్పందించలేదని.. జయరాంను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేయించాలన్నారు.

రాష్ట్రంలో వైకాపా నాయకుల అవినీతికి అంతు లేకుండాపోతోంది. ఎవరికి తోచినట్లు వారు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ఈఎస్ఐ స్కాంలో నిందితునిగా ఉన్న వ్యక్తి నుంచి కారు తీసుకున్న మంత్రి జయరాంపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే ప్రతిపక్ష నాయకులు ఎలాంటి తప్పు చేయకపోయినా జైళ్లలో పెడుతున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది.. ప్రజలకు మేలు చేయడానికి. అంతేకానీ అవినీతి చేస్తూ.. ప్రతిపక్షాలను వేధించడానికి కాదు.. -- కాలవ శ్రీనివాసులు, తెదేపా నేత

Last Updated : Sep 21, 2020, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details