పరమతాలను దూషిస్తూ... రెచ్చగొడుతుంటే పాలకులు పట్టించుకోరా? - కృష్ణా తాజా న్యూస్
హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే కాంక్షతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం తప్పెలా అవుతుందో డీజీపీ సమాధానం చెప్పాలని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు అన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ్చరించారు.
ప్రభుత్వాధికారులు రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. కర్నూలు, కడపలో దేవాలయాలపై జరిగిన దాడుల విషయంలో.. ఆయా జిల్లాల ఎస్పీలకు కనిపించని రాజకీయ పార్టీల ప్రమేయం.. డీజీపీకి ఎలా కనిపించిందని ప్రశ్నించారు. హిందూధర్మాన్ని కాపాడుకోవాలనే బాధతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం తప్పెలా అవుతుందో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. మతం ముసుగులో వైకాపా రాజకీయ అజెండాను భుజాలపై వేసుకున్న ప్రవీణ్ చక్రవర్తిని ఎలా ఉపేక్షిస్తున్నారని నిలదీశారు. పరమతాలను దూషిస్తూ, రెచ్చగొడుతుంటే పాలకులు పట్టించుకోరా అని నిలదీశారు.