ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం జగన్​.. బీసీల ఆస్తుల జోలికొస్తే ఖబడ్దార్' - tdp leader kalava srinivas fire on Destroying the assets of TDP leaders

వైకాపా రెండేళ్ల పాలనలో కూల్చివేతల ఘనకార్యాలే తప్ప మరేమీ చేయలేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఆక్రమణల పేరుతో తెదేపా నేతల ఆస్తులను టార్గెట్ చేశారని.. బీసీల ఆస్తుల జోలికొస్తే ఖబడ్దార్ అని​ హెచ్చరించారు.

tdp leader kalava srinivas fire on Destroying the assets
తెదేపా నేతల ఆస్తులే లక్ష్యంగా కూల్చివేతలు

By

Published : Jun 13, 2021, 8:00 PM IST

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి జగన్‌.. రెండేళ్లుగా చింతామణి సూక్తులు చెప్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. వైకాపా రెండేళ్ల పాలనలో కూల్చివేతల ఘనకార్యాలే తప్ప.. ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. బీసీల ఆస్తుల జోలికొస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.

ఆక్రమణల పేరుతో తెదేపా నేతల ఆస్తులను టార్గెట్ చేశారని.. ఇప్పటికి రెండుసార్లు పల్లా శ్రీనివాస్ ఆస్తులను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. పల్లాను టార్గెట్ చేయడం బడుగు బలహీన వర్గాలపై దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం కడుపుకొట్టే పనులు కాదు.. కడుపు నింపే పనులు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. ఉత్తరాంధ్రలో నిత్యం అలజడి సృష్టిస్తున్న రావణాసుర ప్రభుత్వాన్ని ప్రజలే బూడిద చేస్తారని కాల్వ అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details